అయోధ్య విరాళాల కేసులో పురోగతి: 150 మంది అనుమానితుల గుర్తింపు|

0
5

అయోధ్య రామ మందిర విరాళాల అక్రమాల దర్యాప్తు:

అయోధ్య రామ మందిర విరాళాల అక్రమాల దర్యాప్తులో సిట్ (SIT) కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో సుమారు 150 మంది అనుమానితులను గుర్తించగా, వారిలో 25 మందిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధాన నిందితుల విచారణ ద్వారా రూ.2 కోట్ల నగదు, కొంత బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా భక్తురాలు ఇచ్చిన ఆభరణాల వ్యవహారంపై కూడా విచారణ జరుగుతోంది.

రామ మందిరంలో రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాలు మాయమైనట్లు యూపీ మాజీ మంత్రి పవన్ పాండే జూన్ 7న ఆరోపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు వేగవంతం చేసిన సిట్, త్వరలోనే ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించనుంది.