సైబర్ భద్రతలో తెలంగాణ రికార్డు: ప్రగతిలో అగ్రస్థానం!|

0
1

సైబర్ నేరగాళ్లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. పిఎంఓ నిర్వహించిన ‘ప్రగతి’ రివ్యూ మీటింగ్‌లో ఇ-జీరో ఎఫ్‌ఐఆర్, సమన్వయ్, మరియు సహయోగ్ పోర్టల్ల సమర్థవంతమైన వినియోగంలో రాష్ట్రం నంబర్ 1 ర్యాంకు సాధించింది. TGCSB ఆధ్వర్యంలో రూ. 16.42 కోట్ల బాధితుల సొమ్మును రికవర్ చేయడమే కాకుండా 20,000 పైగా అక్రమ యుఆర్‌ఎల్‌లను తొలగించారు. పౌరులకు సత్వర సహాయం అందించేందుకు 8712665600 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించామని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ 1930 లేదా సైబర్ పోర్టల్‌ను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు.