🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు మరియు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రంథాలయం చైర్మన్ కామ్లే అనిల్ కుమార్ విద్యార్థులకు స్వయంగా పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి సహకారంతో అందిస్తున్న పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం, స్టూడెంట్ కిట్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ‘మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్’ (ఉదయపు అల్పాహారం) కూడా అందిస్తామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ నిర్మాణం విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో చదువుకుని ఉన్నత పదవులు చేపట్టాలని, చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దుర్గ మహేష్, ఆసిఫాబాద్ కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, విద్యార్థి నాయకులు రాజేందర్, (NSUI) నాయకులు జమీర్, ఉప సర్ తదితరులు పాల్గొన్నారు.










