ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, IPS గారు,.
🚩రేపు అనగా 19.06.2026 తేదీన ఉదయం రాష్ట్ర అటవీ శాఖ దళాధిపతి డా. పి.వి. చలపతి రావు, IFS గారి ఆధ్వర్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రహ్మానందపురం ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయం ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు చెందిన నూతన రాష్ట్ర కార్యాలయం “అరణ్య రామం” నిర్మాణానికి సంబంధించి నిర్వహించనున్న గౌరవ భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొననున్నారు.
భూమి పూజ కార్యక్రమం అనంతరం ఎయిమ్స్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అటవీ శాఖ కార్యాలయ ప్రాంగణంలో మొక్క నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వీఐపీ రాకపోకల మార్గాలు, బందోబస్తు ఏర్పాట్లు తదితర అంశాలను ఈ రోజు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, IPS గారు స్వయంగా పరిశీలించారు.
ఉప ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ఈ పరిశీలనలో నార్త్ డీఎస్పీ శ్రీ మురళీకృష్ణ గారు, ఎస్బీ డీఎస్పీ శ్రీ అలహారి శ్రీనివాస్ గారు, తాడేపల్లి సీఐ శ్రీ వీరేంద్రబాబు గారు, తాడేపల్లి ఎస్ఐ శ్రీ కాజావలి గారు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు..










