ఈ నెల 27 వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లి లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, సీఎం వో ప్రతినిధి డానిష్, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, ఇతర అధికారులు. ఈ సందర్భంగా సీఎం హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న పనులు, ప్రజా వేదిక, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు, ఇతర పనులను వారు క్షుణ్ణం గా పరిశీలించారు.
అనంతరం జిల్లా లోని అన్ని శాఖల అధికారులతో అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించి సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు చేయాల్సిన పనుల పై అన్నీ ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా అధికారులు అన్నీ జాగ్రత్త లు తీసుకొని సీఎం పర్యటన విజయవంతం చేయాలని కోరారు.










