ఒత్తిడిని జయించేలా: ఏపీ పోలీసుల సరికొత్త అడుగు|

0
0

 నిరంతర డ్యూటీలు, కఠినమైన సవాళ్లతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు సిబ్బంది మానసిక ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సిబ్బంది కోసం ప్రత్యేకంగా ‘వెల్నెస్ అండ్ కౌన్సిలింగ్’ సెషన్లను నిర్వహిస్తోందియోగా, ధ్యానం, మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారిలో మానసిక ఉల్లాసాన్ని నింపుతున్నారు.

కుటుంబ సభ్యులతో గడపడానికి వీలుగా వీక్లీ ఆఫ్స్ క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగుంటేనే విధులు సమర్థవంతంగా నిర్వహించగలరనే ఉద్దేశంతో తీసుకుంటున్న ఈ నిర్ణయం పోలీసుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ మానవీయ కోణం సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరుస్తోంది.