TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. మొత్తం 16 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14.7 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్ (D)లోని నేరేడుగొండలో అత్యల్పంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు తెలిపింది.










