గిరిజన ఆశ్రమ పాఠశాలల సమస్యలను వెంటనే పరిష్కరించాలి|

0
6

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గిరిజన శాఖ అభివృద్ధి అధికారి రమాదేవికి ఆయన వినతిపత్రం అందజేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున కనీస సౌకర్యాల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చోట్లా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.

శిథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు చేపట్టాలని, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు. అలాగే జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాలల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.