కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సంఘటన్ సృజన్ అభియాన్’ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు పదవుల్లో సముచిత స్థానం, గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. నాయకులు ఐక్యంగా పని చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను బూత్ స్థాయి నుంచి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










