మదనపల్లి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా మస్రూర్ అహ్మద్ బాధ్యతలు.|

0
0

మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మస్రూర్ అహ్మద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలను ఇంతకుముందు డాక్టర్ రమేష్ నిర్వహించేవారు, ఇకపై ఆయన ఆస్పత్రి ప్రిన్సిపాల్‌గా కొనసాగుతారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత, డాక్టర్ మస్రూర్ అహ్మద్‌ను ఆర్‌ఎంవో డాక్టర్ రాధిక, ఇతర వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ మస్రూర్ అహ్మద్ తెలిపారు.