నిమ్మనపల్లె: పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రతిభకు ప్రశంసాపత్రం.|

0
0

నిమ్మనపల్లె మండలంలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి గాయత్రి గ్రామ పరిపాలన, పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రశంసాపత్రం గురువారం అందుకున్నారు. పంచాయతీలో అభివృద్ధి పనులు, పరిశుభ్రత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా కడపలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకరరావు ఆమెకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను అభినందించారు.