మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. డ్రగ్స్ విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటూ, నెట్‌వర్క్‌లను చేధిస్తూనే, మరోవైపు యువతను రక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
ఇందుకోసం కళాశాలలు, విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను వివరిస్తూ విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు. యువత మత్తుకు బానిస కాకుండా
, వారి భవిష్యత్తును కాపాడేందుకు ‘యాంటీ డ్రగ్ కమిటీల’ను ఏర్పాటు చేశారు. కఠినమైన చట్టాల అమలుతో పాటు సామాజిక బాధ్యతగా అవగాహన కల్పిస్తూ, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు పోలీసులు శ్రమిస్తున్నారు.










