🔹*_నందిగామలో భక్తిశ్రద్ధలతో పీర్ల పండుగ వేడుకలు_*
🔹*_మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అన్నదాన కార్యక్రమం_*
Bharat Awaaz/
🎯_నందిగామ పట్టణంలో పీర్ల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పీర్లను తీసుకుని భక్తులు పట్టణ వీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువలు వెల్లివిరిశాయి._
🎯_భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమాజంలో శాంతి, సుఖసంతోషాలు నెలకొనాలని ప్రార్థించారు. పండుగ సందర్భంగా భారత టాకీస్ రోడ్డులోని పీర్ల వద్ద భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పాల్గొని సామరస్యానికి ప్రతీకగా నిలిచారు._
🎯_చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు._
🎯_ఈ సందర్భంగా నందిగామ పట్టణ మూడో వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఇమామ్ జానీ మాట్లాడుతూ, పీర్ల పండుగ మత సామరస్యానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. భిన్న మతాల ప్రజలు ఒకే వేదికపై కలిసి పాల్గొనడం నందిగామలో నెలకొన్న సోదరభావానికి నిదర్శనమని అన్నారు._
🎯_పీర్ల పండుగ వేడుకలు భక్తి, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతలను చాటుతుందని తెలిపారు._










