రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
ఢిల్లీలో పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు గుంటూరుకు విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన స్వాగత యాత్రలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి గారు పాల్గొన్నారు.
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–1లోని భాష్యం గరుడ క్యాంపస్ నుండి ప్రారంభమైన స్వాగత యాత్రలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పాల్గొని, రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి మొక్కను బహుకరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీమతి గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ, శ్రీ భాష్యం రామకృష్ణ గారు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేయడం గుంటూరు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను సమర్థవంతంగా రాజ్యసభలో ప్రస్తావిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల సాధనకు ఆయన కీలక పాత్ర పోషిస్తారని నమ్మకాన్ని శ్రీమతి గళ్ళా మాధవి గారు వ్యక్తం చేశారు.










