పుంగునూరు: బోయకొండ గంగమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తులు|

0
0

అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి గ్రామములో ఉన్న బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని ఆదివారం నాడు హైకోర్టు న్యాయమూర్తులు మహేశ్వర రావ్, T.C.D. శేఖర్, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి N. జయసూర్య, జిల్లా జడ్జి అరుణ చారుక దర్శించుకున్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏకాంబరం వారికి అమ్మవారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు వేద పండితుల ఆశీర్వాదం పొందారు# కొత్తూరు మురళి.