మంచిర్యాల జిల్లా : మందమర్రి పట్టణంలోని బి-1 కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌ఏ-2 సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పలువురు పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏ-2 ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి డా. వివేక్ వెంకటస్వామి బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడం, బీఎల్‌ఏ-2 వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం, ఓటరు జాబితాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై సమీక్ష నిర్వహించారు.ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.










