రామసముద్రంలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.|

0
0

సోమవారం రామసముద్రంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన ఉగిని నాగరాజ్, ఉగిని ప్రశాంత్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 62 మద్యం పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, నిందితులను మదనపల్లె కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించి, మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.