పరాయి మోజులో పడి.. రుబ్బురాయితో భర్తను హతమార్చిన భార్య!|

0
2

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసిన ఘటన మదనపల్లెలో వెలుగు చూసింది. అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి నిందితుల అరెస్టు వివరాలను మంగళవారం వెల్లడించారు. పెద్దమండెం మండలం నారమాకుల తండాకు చెందిన చిన్నబుడ్డన్ననాయక్ భార్య రమీల, అదే ఊరి రెడ్డప్పనాయక్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త మందలించడంతో కక్ష పెంచేసుకుంది. ఈనెల 18 రాత్రి ప్రియుడితో కలిసి రుబ్బురాయితో తలపై మోది భర్తను చంపేసింది.