పెద్దలకు భరోసా – ఒంటరి వృద్ధులకు AP పోలీస్ తోడుగా|

0
0

ఒంటరిగా ఉంటున్న సీనియర్ సిటిజన్ల రక్షణ కోసం AP పోలీస్ “పెద్దలకు భరోసా” ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. బీట్ ఆఫీసర్ ప్రతి వారం వారి ఇంటికి వెళ్లి ఆరోగ్యం, మందులు, రోజువారీ అవసరాలు అడుగుతారు. అత్యవసర నంబర్ స్టికర్ ఇంటి గోడపై అతికించి 10 నిమిషాల్లో స్పందించేలా డేటాబేస్ మెయింటైన్ చేస్తారు.

పండుగలకు స్వీట్లు ఇచ్చి మానసిక ధైర్యం పెంచుతారు. మోసాలు, దొంగల నుండి కాపాడుతూ “మీ పిల్లలు లేకపోయినా మేమున్నాం” అనే భరోసా ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం స్థానిక PS సంప్రదించండి.