“రెండేళ్ల పదవీకాలంతో పాలకమండలి నియామకం.”
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ మంగళవారం జి.ఓ.ఆర్.టి. నెం.392ను జారీ చేసింది.
పాలకమండలి చైర్మన్‌గా ఎం. సత్యనారాయణ రెడ్డిని నియమించగా, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, విజయేందర్ తుల, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమణి, ఎం. రాఘవేంద్రరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్తో పాటు వ్యవస్థాపక ట్రస్టీని నియమించింది.
అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్స్ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్థానాచార్యులు లేదా సీనియర్ ప్రధాన అర్చకుడు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కొనసాగనున్నారు.
వ్యవస్థాపక ట్రస్టీ, ఎక్స్‌అఫీషియో సభ్యులు మినహా చైర్మన్, ఇతర సభ్యుల పదవీకాలం రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
#Sidhumaroju










