అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.










