ఆసిఫాబాద్, జూలై 02: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలను ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ గారు సందర్శించారు. ఆమెతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్, ముఖ్య నాయకులు గాజుల జక్కన్న, విశ్వనాథ్ గారు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన తీరును పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల క్రమశిక్షణ మరియు విద్యాసంస్థ రోజువారీ నిర్వహణకు సంబంధించిన వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
గురుకులంలో విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ బాగున్నాయని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల సమగ్ర అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నిరంతరం కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయ బృందాన్ని చైర్‌పర్సన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి, భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






