టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (TWJU) సభ్యత్వ నమోదు మరియు పునరుద్ధరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల అధ్యక్షుడు ఎస్.కె. సల్మాన్ పాషా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జర్నలిస్టుల ఐక్యతే యూనియన్ బలానికి పునాది అని వారు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న రవాణా, మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇస్తూ, సభ్యులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.










