గంగారంలో భారీగా సభ్యత్వ నమోదు
మహబూబాబాద్ జిల్లా గంగారంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గాడిపెళ్లి శ్రీహరి సమక్షంలో మండలంలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో యూనియన్ సభ్యత్వం పొందారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అక్రిడిటేషన్, ఇన్సూరెన్స్ వంటి సమస్యలపై యూనియన్ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల ఐక్యతే వారి బలానికి మూలమని, ప్రజాస్వామ్య రక్షణలో మీడియా పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు. మండల అధ్యక్షుడు బుర్కా యాదగిరి ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టులందరినీ యూనియన్‌లో చేర్పించి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తీర్మానించారు.










