“అల్వాల్‌లో సీనియర్ సిటిజన్స్‌కు SIRపై అవగాహన సదస్సు”
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (ASCA) ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే. శ్రీనివాస్ వర్మ పాల్గొని సీనియర్ సిటిజన్స్‌తో ముచ్చటించారు. ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఓటరు జాబితా నుంచి ఒక్కరి పేరు కూడా అన్యాయంగా తొలగిపోకుండా ప్రతి ఓటును రక్షించేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తారని తెలిపారు.
సీనియర్ సిటిజన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటింటికీ వెళ్లి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం సీనియర్ సిటిజన్స్‌కు SIR దరఖాస్తు ఫారాలను ఎలా నింపాలి, ఏయే ధ్రువపత్రాలు సమర్పించాలి, సందేహాల నివృత్తికి అనుసరించాల్సిన విధానాలను వివరంగా తెలియజేశారు.
కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










