“పూడిక తీయగా బయటపడిన గుర్తుతెలియని మృతదేహం”
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని మోతుకుల కుంట ఔట్‌లెట్ నాలాలో పూడిక తొలగింపు పనులు చేపడుతున్న హైడ్రా సిబ్బందికి గుర్తుతెలియని మృతదేహం బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది.
హైడ్రా సిబ్బంది వెంటనే అల్వాల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక పరిశీలనలో మృతదేహం సుమారు 15 రోజుల క్రితం నాటిదై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
వివరాలు ఇంకా తెలియరాలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, గుర్తింపు కోసం చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#Sidhumaroju
Alwal










