చీరాల మండలం పిట్టువారి పాలెం – గవినివారి పాలెం మధ్య ఉన్న వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ను అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగిలించిన ఘటన స్థానిక రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కారణంగా ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేరుశనగ పంటలకు నీరందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, అలాగే దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రైతులు కోరుతున్నారు. పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.










