తిరుపతి వద్ద పవిత్ర వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాస వేడుక|

0
2
వకుళమాత ఆలయంలో నూతన మండపాన్ని ప్రారంభించి, చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయిస్తున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు మరియు ఎమ్మెల్యే పులివర్తి నాని.

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి సమీపంలోని పవిత్ర వకుళమాత ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షరాభ్యాసం, అన్నప్రాశన మండపాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా శ్రీవారి తల్లి ఆలయంలో ఈ అద్భుతమైన వసతి కల్పించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా చైర్మన్, ఎమ్మెల్యే గారు స్వయంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి ఆశీర్వదించారు.

అనంతరం పిల్లలకు ‘అక్షర గోవిందం’ కిట్లను అందజేశారు. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో వేద పండితులు సూచించిన ముహూర్తాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చిన్నారులు, భక్తుల కోసం టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ ఇంచార్జ్ జె.బి. శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.