జనసేన పార్టీ పదవికి దరఖాస్తు చేసిన యువ నాయకుడు తోట కళ్యాణ్.|

0
0

మదనపల్లెకు చెందిన జనసేన పార్టీ యువ నాయకుడు తోట కళ్యాణ్, రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఎదుట పార్టీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ అబ్జర్వర్లు అడపా సురేంద్ర, జయ భవ్య దరఖాస్తును స్వీకరించారు. పార్టీ ఆదేశాల మేరకు పదవుల దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించినట్లు అడపా సురేంద్ర తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.