ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు జనకాపూర్, పోచమ్మ కాలనీలలో వర్షపు నీరు నిలిచిపోయి పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న విషయంపై స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరడంతో మున్సిపల్ యంత్రాంగం త్వరగా స్పందించి, క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించింది.కౌన్సిలర్ వినోద్ కుమార్ స్వయంగా క్షేత్రస్థాయికి చేరుకుని పనులను పర్యవేక్షించగా, మున్సిపల్ సిబ్బంది నీటి నిల్వలను తొలగించే పనులను పూర్తి చేశారు. ఇన్నాళ్లుగా పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు, రాకపోకలకు కాలనీవాసులు పడుతున్న ఇబ్బందిని వెంటనే పరిష్కరించినందుకు గాను స్థానిక కాలనీవాసులు కౌన్సిలర్ గారికి మరియు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.










