బాబూ జగ్జీవన్ రామ్‌కు ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళి.!|

0
6

“పికెట్‌లోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి”

మేడ్చల్ మల్కాజిగిరి : భారత మాజీ ఉపప్రధాని, నవభారత నిర్మాత బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పికెట్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ రాజకీయాలు, సామాజిక సేవలో బాబూ జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవానికి విశేష కృషి చేసి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ పిలుపునిచ్చారు.

#Sidhumaroju