“జ్ఞానమాల కార్యక్రమంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గద్దర్ ఆశయాల స్మరణ”
మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 6: ఆల్వాల్ అంబేద్కర్ నగర్‌లో జ్ఞానమాల 160వ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ప్రజాకవి గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వెంకటచారి, శివశంకర్, సంపత్ కుమార్, బాలమల్లేష్ పాల్గొని మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన అవసరాన్ని వివరించారు.
సామాజిక సమానత్వం, విద్య, చైతన్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సి.ఎల్. యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జి. రాజయ్యతో పాటు అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ ప్రతినిధులు, పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










