నందిగామ జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ శాఖ గ్రంథాలయంలో భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి అల్లూరు రామచంద్రుడు బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, 1908 ఏప్రిల్ 5న జన్మించిన బాబూ జగ్జీవన్‌రామ్ భారత ఉపప్రధానిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా విశిష్ట సేవలు అందించారని, కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. అందరూ ప్రేమగా “బాబూజీ” అని పిలిచే ఆయన 1986 జూలై 6న పరమపదించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు గోపాలకృష్ణ, నరేంద్ర, విద్యార్థులు పాల్గొని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.










