యూట్యూబ్ చూసి గొలుసు దొంగలుగా మారిన తల్లి, కొడుకులు|

0
6

AP: విశాఖపట్నంలోని పెందుర్తిలో జూన్ 27వ తేదీ సాయంత్రం 68 ఏళ్ల వృద్ధురాలి మెడలోని 5 తులాల బంగారు గొలుసు, తాళిని స్కూటీపై వచ్చిన తల్లీకొడుకులు దొంగిలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను విశాఖలోని రామా టాకీస్ ప్రాంతానికి చెందిన ధనలక్ష్మీ, అక్షిత్‌లుగా గుర్తించారు. లగ్జరీ జీవితానికి అలవాటుపడి, అప్పులపాలైన ధనలక్ష్మీ, సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం యూట్యూబ్‌లో వెతికి, ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు ‘గో టూ బ్యాక్’ విధానంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, నిందితులు బయలుదేరిన ఇంటిని గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తల్లీకొడుకులు జైలుపాలయ్యారు.