మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (HM) అవినీతి, వేధింపులకు పాల్పడి విమర్శల పాలయ్యాడు. సర్టిఫికెట్ల అటెస్టేషన్ కోసం వచ్చిన ఓ యువకుడిని రూ. 5,000 లంచం అడిగి, మొదట రూ. 1,000 తీసుకుని సంతకాలు చేశాడు. అయితే, మిగిలిన రూ. 4,000 కోసం సదరు హెచ్ఎం సదరు యువకుడిని ఫోన్ కాల్స్, మెసేజ్లతో తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులతో బాధితుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే లంచం కోసం దిగజారి ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిరుద్యోగిని వేధిస్తున్న హెచ్ఎంపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.










