చింతూరు డివిజన్ ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతం కర్మన్ కొండ లో గత మూడురోజుల క్రితం పాముకాటుకు గురైన యువతి సూట్రు సమ్మక్క ప్రియ (18) సంవత్సరాలు డోలిమోతతో కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చికిత్స నిమిత్తం చేర్పించినా సంగతి విదితమే. ఈరోజు సమ్మక్క ప్రియ విజయవాడ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. వివరాల ప్రకారం పాముకాటు వేసిన సోమవారం రాత్రి చికిత్స కోసం కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చేర్పించగా వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి విషమించడంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అక్కడ కూడా పరిస్థితి విషమంగానే ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించడం జరిగింది.
అక్కడ చికిత్స పొందుతూ సమ్మక్క ప్రియా ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. సమ్మక్క ప్రియ మరణ వార్త వినగానే కళాశాల స్నేహితులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమాయకపు ఆదివాసి గిరిజనులు సరైన వైద్య సేవలు లేక ఇలా అనేకమంది చింతూరు డివిజన్ ఏజెన్సీలో మరణించిన కథనాలు అనేకం,ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అనేక గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని కోతున్నాయి.
# Yadagiri










