జులై 19న కోస్గిగి లో వాల్మీకుల సదస్సు|

0
1

 

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో ఈ నెల 19న కోసిగిలో నిర్వహించనున్న ‘వాల్మీకి చైతన్య సదస్సు’ను విజయవంతం చేయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు, మాజీ జెడ్పీటీసీ శ్రీ రామ్ భీం నాయుడు పిలుపునిచ్చారు.

కోసిగిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది వాల్మీకుల అభివృద్ధికి ఎస్టీ హోదా ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి, సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా వాల్మీకి కుటుంబాలన్నీ సదస్సుకు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు.