చాగలమర్రిలో ఐదో రోజు ‘మన భూమా – మన ధీమా’ కార్యక్రమం|

0
1

నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం డి. వనిపెంట గ్రామంలో “మన భూమా – మన ధీమా” కార్యక్రమం ఐదో రోజు ప్రజలతో మమేకమయ్యాను.

ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులతో వెంటనే చర్యలు ప్రారంభించాం. ఈ సందర్భంగా రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులను ప్రారంభించడం ఆనందంగా ఉంది.

చిన్న గ్రామం, పెద్ద గ్రామం అనే తేడా లేకుండా ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రతి హామీని అమలు చేయడం, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలవడమే మా లక్ష్యం.

మీ ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాలతో మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను