క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ ‘పల్లె నిద్ర’ పర్యటన|

0
3

క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ ‘పల్లె నిద్ర’ పర్యటన

టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ‘పల్లె నిద్ర’ ముగించుకుని, ఉదయాన్నే గ్రామంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు . కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరణ, ఇరిగేషన్ కాలువలు, అంగన్‌వాడీ కేంద్రం, ఎస్సీ కాలనీ, తాగునీటి సమస్యలు, ఎత్తిపోతల పథకం, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం తదితర అంశాలను పరిశీలించారు.

ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల వద్దే తెలుసుకోవడం, స్థానిక సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించడం పల్లె నిద్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నిధులు అవసరమైన సమస్యలను కన్వర్జెన్స్ ఫండ్స్ లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.మూడు మండలాలను అనుసంధానించే రహదారి, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, అంగన్‌వాడీ భవనాలు, తాగునీటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.