మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన 16 హై-రిజల్యూషన్ సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. బస్టాండ్‌లో చోరీలు, అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయడంలో ఈ నిఘా నేత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిరంతరం నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశిస్తూ, కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన డీఎస్పీ, సీఐలను ఎస్పీ అభినందించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.










