లోపట్నూతల గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి గారు
లింగాల మండలం లోపట్నూతల గ్రామానికి చెందిన రామాచారి, శ్రీమతి సృజన దంపతుల నాలుగేళ్ల కుమార్తె నిత్విక గత నెల జూన్‌లో నీటి డ్రమ్‌లో పడి విషాదకరంగా మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ రోజు బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి మాజీ ఎమ్మెల్సీ,పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చిన్నారి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందేలా తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు.
చిన్నారి నిత్విక ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.* ఈ కార్యక్రమంలో లింగాల మండల టీడీపీ ఇంచార్జ్ సంజీవరెడ్డి, లింగాల మండల టీడీపీ అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి ,లింగాల మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..










