తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు.
ఆదివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ టిడిపి జోనల్ కో-ఆర్డినేటర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గారు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి జిల్లా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి గారితో కలిసి దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.
అలాగే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు, యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారితో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.










