మహిళల భద్రత కోసం శక్తి యాప్: ప్రకాశం పోలీసుల అవగాహన|

0
0

మహిళల భద్రతే లక్ష్యం… శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీసు సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా శక్తి (Shakthi) యాప్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు మరియు ప్రజలకు శక్తి యాప్ యొక్క ఉపయోగాలు, అత్యవసర సమయంలో SOS ఫీచర్ ద్వారా పోలీసులను ఎలా సంప్రదించవచ్చో వివరించారు. అలాగే పాల్గొన్న వారందరి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, నమోదు (రిజిస్ట్రేషన్) చేయించారు.

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్‌ను ప్రతి మహిళ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని పోలీసులు సూచించారు.