అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో లేడీ డాన్‌గా పిలవబడే కోనేటి సులోచనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. భూకబ్జాలు, మోసాలు, నకిలీ పత్రాల వినియోగం, హత్యాయత్నం వంటి ఆరోపణలతో కోనేటి సులోచన పేరు లేడీ డాన్‌గా గతంలో వార్తల్లో నిలిచింది. మదనపల్లె వన్‌టౌన్, టూటౌన్, తాలూకా వంటి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కోనేటి సులోచనపై మొత్తం 14 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో చీటింగ్ కేసులతో పాటు హత్యాయత్నానికి సంబంధించిన కేసు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఆమెపై పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.










