ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షా సమావేశంలో దర్శి టిడిపి ఇన్‌చార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని, దొనకొండ అభివృద్ధిపై కీలక ప్రతిపాదనలు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి సమక్షంలో ఈ సమావేశం జరిగింది. దొనకొండలోని 46 చెరువుల అభివృద్ధి, ₹100 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, తాగునీటి సమస్యల పరిష్కారంపై ఆమె చర్చించారు. ఈ నెల 23న జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలు రూపొందిస్తారని తెలిపారు. దొనకొండను కరువు రహిత ప్రాంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.










