ఈరోజు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి (Mother & Child Hospital), నిజామాబాద్‌ను సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, విభాగాల పనితీరు మరియు ప్రజలకు అందుబాటులో ఉంచిన సమాచార బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించాను.
తనిఖీ సందర్భంగా H.D. Unit, A.N.C. Clinic, జీవనధార ఫార్మసీ మరియు ఆసుపత్రిలోని ఇతర విభాగాల పనితీరును పరిశీలించి, రోగులకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన మరియు ప్రజలకు అనుకూలమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు అధికారులకు అందజేశాను.ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా, రోగి కేంద్రిత సేవలు, పరిశుభ్రత, సమయపాలన మరియు సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించాను.ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆ దిశగా నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ వైద్య సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుంది.










