సీలేరు, డొంకరాయి నుండి గోదావరి డెల్టాకు నీరు విడుదల: చింతూరు|

0
0

పోలవరం జిల్లా తూర్పు డివిజన్ చింతూరు పరిధిలోని సీలేరు, డొంకరాయి నుండి గోదావరి డెల్టా మూడు కాలువలకు నీరుని విడుదల చేశారు. డొంకరాయి జలాశయం నుంచి 3000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తున్నట్టు ఏపీ జెన్కో అధికారులు స్పష్టం చేశారు. 16 నుండి 25 వరకు డొంకరాయి ప్రధాన ఆనకట్ట 6,7 గేట్ల నుండి నీటిని ధవలేశ్వరం అధికారుల మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఏ,పి జెన్కో అధికారులు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలు నదిని దాట వద్దని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

 

# Yadagiri