“జగన్నాథ రథయాత్ర” లో మర్రి దంపతుల సేవాభావం.|

0
7

“ప్రత్యేక పూజలతో పాటు ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే దంపతులు”

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 16: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన సతీమణి మమతా రెడ్డి తో కలిసి అల్వాల్‌లోని సుమారు 400 ఏళ్ల చారిత్రక శ్రీ జగదీప్ మందిర్‌లో నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం సేవాభావానికి ప్రతీకగా ఆలయ ప్రాంగణాన్ని స్వయంగా చీపురుతో శుభ్రం చేశారు. తర్వాత పల్లకి సేవలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి వారిని రథం వద్దకు తీసుకువచ్చి, వేద మంత్రోచ్చారణల నడుమ రథయాత్రను ప్రారంభించారు.

రథయాత్ర అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే దంపతులు ఆలయ అర్చకులు, నిర్వాహక కమిటీ సభ్యులను అభినందించారు.

శ్రీ జగన్నాథ స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మహంతి నారాయణదాసు, టింకు జగదీష్ ఫారిక్, సూరత్ సింగ్, ఆర్.సి. సింగ్, నర్సింగ్, గోపాల్ సింగ్, బీఆర్ఎస్ నాయకుడు తోట నరేందర్ రెడ్డి, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal