రాజాంలోని తెలగా వీధిలో గురువారం రాత్రి పామును పడుతుండగా స్నేక్ క్యాచర్ గ్రంధి అప్పారావు పాము కాటుకు గురయ్యాడు. నాగుపాముని పట్టుకొనే క్రమంలో అతని చేయి వేలు మధ్యలో కాటు వేసిందని స్థానికులు తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి వెంటనే తరలించి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు. అప్పారావు ఇప్పటివరకు సుమారు 150 ప్రమాదకరమైన పాములను పట్టి సురక్షిత ప్రాంతాలలో వదిలినట్లు స్థానికులు చెబుతున్నారు.
#Boiena Rajesh










