‘తల్లికి వందనం’ విద్యార్థులకు స్వర్ణయుగం: కూటమి నేతలు|

0
2

Madanapalle: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల విద్యాభివృద్ధి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం రాష్ట్రంలో విద్యారంగానికి కొత్త ఊపునిస్తుందని మదనపల్లె 34, 35 వార్డుల ఇన్‌చార్జ్, స్నేహ మెడికల్స్ నిర్వాహకుడు రమేష్ రెడ్డి, 34వ వార్డు జహ యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యనే సమాజ అభివృద్ధికి పునాదిగా భావిస్తూ ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయడం ఎంతో గొప్ప నిర్ణయం. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో తీసుకొచ్చిన ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.

 

విద్యార్థుల కలలను సాకారం చేసే ఈ సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తుంది” అని అన్నారు. అనంతరం బాలమాలి శేఖర్ మాట్లాడుతూ, “రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ‘తల్లికి వందనం’ పథకం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే చారిత్రాత్మక నిర్ణయం.